రైతన్న గొప్పదనం - Madhavi Pisupati


...

ప్రచురించబడిన తేది : 13-Nov-21

ఓ రైతన్నా! ఆశల విత్తనాన్ని బతుకు పంటలో వెదజల్లుతూ బువ్వ కంకులను అందరికీ పంచే మనిషివి నీవు.
ఓ రైతన్నా! తొలకరి చినుకు కోసం నిరీక్షిస్తూ, నిరంతరం ఆరాటపడుతున్నావు నీవు.
ఓ రైతన్నా! జానెడు పొట్ట కోసం, పిడికెడు మెతుకులతో సేద తీరుతున్నావు నీవు.
ఓ రైతన్నా! మట్టినే దైవంగా భావించి మండుటెండలను లెక్క చేయక దుక్కి దున్ని పంటలను పండిస్తున్నావు నీవు.
ఓ రైతన్నా! నీ కష్టాలను దిగమింగుతూ పరుల ఆనందానికై శ్రమిస్తున్నావు నీవు.
ఓ రైతన్నా! దుక్కి దున్ని పండించిన ముక్కారు పంటలతో మా సుఖ సంతోషాలకు నిలయం నీవు
ఓ రైతన్నా! ఈ మకర సంక్రాంతి పండగ నాడు మేము కడుపు నిండా తినడానికి కారణం నీవు.
ఓ రైతన్నా! అందరి హృదయాలలో అన్నదాతగా, చిరస్మరణీయుడవై నిలిచిపోయావు నీవు
ఓ రైతన్నా! దేశానికి మకుటాయ మానంగా వెలుగొందుతూ, రైతే రాజయ్యేలా కలకాలం వర్ధిల్లాలి నీవు అన్నదాత సుఖీభవ!!

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | BY LAWS | LATA 2024 TELUGU CALENDAR | TAX SUMMARY | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®