సంక్రాంతి విశిష్టత - Ravi Kumar Pisupati


...

ప్రచురించబడిన తేది : 13-Nov-21

సంక్రాంతి పండుగ నిలపాలి మన అందరి జీవితాలలో సుఖ సంతోషాల క్రాంతి

రంగు రంగుల ముగ్గులతో,గుమ్మడి పూల గొబ్బెమ్మలతో మన ఇంట వెల్లివిరిసేను నూతన క్రాంతి

దట్టమయిన చలి పులిని పారద్రోలి వెచ్చని హాయినిచ్చు భోగి మంటల క్రాంతి
చిన్నారుల బోసి నవ్వులకు భోగి పండ్ల దీవెనలతో వారి మోములో కురియాలి చిరు నవ్వుల క్రాంతి

కొత్త బియ్యపు కమ్మని పొంగలితో ఇల్లంతా వెదజల్లాలి ఘుమఘుమల క్రాంతి

డూడూ బసవన్నల మువ్వల సవ్వడితో, హరిదాసుల సంకీర్తనలతో వచ్చేను మన ఊరికి స్రావ్యమయిన క్రాంతి

దుక్కి దున్ని పండించిన ముక్కారు పంటలతో రైతన్న ఇంట కురియాలి సిరి సంపదల క్రాంతి

శాంతి సుభిక్షాలతో, ఆనందోత్సాహలతో ప్రజల మదిలో ఆనందాన్ని నింపాలి ఈ మకర సంక్రాంతి.

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | BY LAWS | LATA 2024 TELUGU CALENDAR | TAX SUMMARY | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®