పల్లెటూరి సంక్రాంతి - Himabindu Vanipenta


...

ప్రచురించబడిన తేది : 10-Nov-21

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఎకరం పొలం ఉన్న రైతుకు కూడ సూర్యుడు మకరం లో చేరితే ఆనందం, ఎంతో కొంత ధనం, ధాన్యం ఇంటికి వస్తుంది అని. పండుగ సందడి చూడలంటే పల్లెటూరు లోనే.
వేకువజామున హరిదాసు కీర్తనలు మేలుకొలిపితే ,బోగి మంటల సెగలు ఒళ్ళంతా తడుముతాయి.ఆహ్వానించే ముగ్గులు, గొబెమలు ఊరంతా నిండి పోతాయి. బోగి పండ్లు,పూలు ముక్కు పై జారుతుంటే చిన్నారి నవ్వులు ఇంటి నిండా పరుచుకుంటాయి.
నోములు,వ్రతాలతో మకర సంక్రాంతి ముగుస్తుంది.
ఆపై వచ్చేను కనుమ.రైతులు పొద్దున్నే పశువులను కడిగి మువ్వలతో,గంటలతోఅలంకరిస్తారు.
పశువులశాల లో నైవేద్యం పెట్టి, పొలంలో గుమ్మడి కాయ కొట్టి పొలి వేసి వస్తారు.కనుమ రోజు గారెలు తినడం విశేషం.
తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక మన సంక్రాంతి.పచ్చని తోరణాలు,పసుపు రాసిన గడపలు,గాలి పటాల రెప రెపలు, జంట సన్నాయి మేళం, గంగిరెద్దుల తాళం, జంగం దేవర విన్యాసాలు,కోడి పందేలు, కొత్త అల్లుడి సిగ్గు, కొంటె మరదలి ఆటలు, బొమ్మల కొలువులు ఒక్కటా రెండా ,పేరు కే మూడు రోజుల పండుగ ,సంబరం మాత్రం సంవత్సరం సరిపడంత. ఈ సంక్రాంతి మీ జీవితంలో నూతన కాంతి నింపాలని కోరుకుంటునాను.

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | LATA 2026 TELUGU CALENDAR | BY LAWS | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®