రైతు - C.Ramesh


...

ప్రచురించబడిన తేది : 11-Nov-21

-----------****** రైతు *******----------
యావత్ సృష్టి "ఆశ" అనే కత్తితో "భయం" అనే డాలుతో "జీవితం" తో పోరాడుతున్నది. జీవితం తరపున "ఆకలి" విజృంభిస్తుంది..
నిర్విరామంగా జరుగుతున్న ఈ యుద్ధం లో ఆకలితో పోరాడి యావత్ సృష్టి ని రక్షిస్తున్న అలుపెరగని యోధుడు "రైతు"
రణరంగంలో రక్తాన్ని చెమట చుక్కలుగా మలిచి "నిస్వార్ధం" నాటి సేద్యం చేసి మెతుకులను ఆయుధాలుగా తీర్చి ఆకలిని హరించివేసిన అసామాన్య వీరుడు "రైతు"..
తన పోరాటానకి తగిన ఫలం రాకున్న మట్టినుండి మారణాయుధాలు(ఆకలి ని చంపే ఆయుధాలు అని అర్ధం) తీసి విశ్వమానవత్వాన్ని పదర్శిస్తున్న విలక్షణ నిగర్వి "రైతు"..
కదనరంగంలో కష్టాలను చిరునవ్వుతో స్వీకరిస్తూ కాలం తిరగబడిన ఎదురొడ్డి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న కార్యదక్షుడు రైతు....
యుద్ధ"క్షేత్రం"లో విరోచితంగా పోరాడుతూ కన్నతల్లి "అన్నపూర్ణ " కంట కన్నీరు తుడుస్తూ మాతృరుణం తీర్చుకుంటున్న యుద్దకిరణం "రైతు"...
అనునిత్యం ఆకలితో వీరోచితంగా పోరాడుతున్బ ఈ వీరుడికి "కష్టమే" "కర్మఫలం" ..........
ఈ కష్టాన్ని స్పర్శిస్తే యావత్ సృష్టి అర్ధమవుతుంది ...అలాంటి వీరులను ఆకాశంలో చుక్కల్లాగా సృష్టించి కదనరంగానికి కానుకలుగా పంపుతున్నా వీరనారి "భరతమాత" యాదిలో "జై కిసాన్....జై జవాన్"..............

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | BY LAWS | LATA 2024 TELUGU CALENDAR | TAX SUMMARY | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®