మా వూరిలో సంక్రాంతి - Ravi Tiruvaipati


...

ప్రచురించబడిన తేది : 11-Nov-21

పచ్చని పొలాల మధ్య వున్నమావూరు, నాలుగు వీధులతో ఒక ఇరవై యిండ్లతో బస్సు రోడ్డుకు దూరంగా, కొండలకు దగ్గరగా వుంటుంది. నా చిన్నతనంలో మా వక్కరికే మిద్దెల్లు ఉండేది. మిద్దెక్కి చూస్తె అన్ని వీధులు, బస్సు రోడ్డు బాగా కనపడతాయి. సంక్రాంతి పండుగంటే సందడే సందడి! ఒక్క సారిగా ఊరంతా రంగులమయమై పోతుంది! గంగిరెద్దుల రంకెలు, హరిదాసుల వేషాలు, వాళ్ళ రాగాలు, అమ్మలక్కల గొబ్బియ్యాలు, పిల్లల గాలిపటాలు...ఎక్కడ చూసినా సంబరాలు అంబరాన్ని అంటుతుంటాయి! మా మిద్దేక్కి చూస్తె, నాలుగు వీధులు ఎంత ముస్తాబై ఉంటాయో చెప్పనలవికాదు. పండుగ మూడు రోజలూ రకరకాల పిండి వంటలతో ఊరంతా కలిసి చేసుకొంటాము. టౌన్లో వుండే అత్తయ్యలు, బాబాయిలు వారం ముందే వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకొంటారు. ఆ స్మృతులు గుర్తుచ్చే వైభవంగా సంబరాలు చేస్తున్న లాటా వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు!

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | BY LAWS | LATA 2024 TELUGU CALENDAR | TAX SUMMARY | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®