సంక్రాంతి - CHINDAM.RAMESH


...

ప్రచురించబడిన తేది : 11-Nov-21

---—------------------------------సంక్రాంతి--------------—--------- ప్రకృతి ని దైవంగా మలిచి బతుకుదెరువును భక్తిగా కొలిచి సబ్బండవర్ణాల సాక్షిగా తెలుగు సంస్కృతి-సాంప్రదాయాల ప్రవాహం సంక్రాంతి ......
సంక్రాంతి ప్రతి సంవత్సరం పుష్యమి మాసంలో తెలుగు లోగిళ్ళలో సవ్వడి చేస్తుంది....
గతాన్ని (పాత) భోగిమంటలో మసి చేసి నిత్యనూతన ఉత్సాహన్ని నింపుతుంది సంక్రాంతి ...
ఆకాశంలోని "హరివిల్లు" ని అందరి వాకిళ్ళలోకి దింపి ఆనందాన్ని అందిస్తుంది సంక్రాంతి ....
ధాన్యరాశులని పశుపక్ష్యాదులకు పంచి మానవత్వాన్ని మచ్చిక చేస్తుంది సంక్రాంతి ...
హరిదాసులను ఇంటికి తెస్తూ ఆకలి అందరికి ఉంటుంది అని తెలియజేస్తూ పెడితే పెరిగేది కీర్తి అని గుర్తు చేస్తూ ధాన్యానికి దానాన్ని జోడిస్తూ జన్మధన్యం చేస్తుంది సంక్రాంతి ....
ఆవు(గంగిరెద్దులు) అమ్మలాంటిది అని అందరికి తెలియజేస్తూ పశువులలో దైవాన్ని చూపుతూ పరవశింపజేస్తుంది సంక్రాంతి ....
జీవితం అనేది పోరాటము కొంచెం ఆదమరిచిన ఆపాయమే అంటు "కోడిపందెలను" తేస్తూ ఆనందాన్ని అంతే చురుకుతనం తాలూకు విజ్ఞానాన్ని అందిస్తుంది సంక్రాంతి ...
అహాన్ని "గాలిపటం"లా మార్చి "అజ్ఞానం" దారంతో అందనంత ఎత్తులో ఆనందంతో వదిలేయాలని చెప్తుంది సంక్రాంతి ..
జీవితంలో సరదాలు ఆయుష్షు కి ఆయువులు అని చెప్తు బావమరదళ్ళ సరదాలతో ,కొత్త అల్లుళ్ళతో రక్తి కట్టిస్తుంది సంక్రాంతి ...
కొత్త పిండివంటలతో, కోటి కాంతులతో ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్తవెలుగులు పంచాలని ఆశిస్తూ "సంక్రాంతి శుభాకాంక్షలు"......

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | LATA 2026 TELUGU CALENDAR | BY LAWS | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®