నాకు నచ్చిన సంక్రాంతి - Prasad Rani


...

ప్రచురించబడిన తేది : 13-Nov-21

సంక్రాంతి – నా చిన్నప్పటి జ్ఞాపకాలలో అతి మధురమైన క్షణాలను తనలో పొదువుకున్న పండుగ. ఈ పండుగ ని సంకురాత్రి అని అంటే – ఇది సంకురాత్రి , పెంకు పగలు కాదు – సంక్రాంతి అని చెప్పాడు మా బాబాయ్. అంతే కాదు సంక్రాంతి అనేది శివరాత్రి లాగ ప్రతి నెల వస్తుందని చెప్పాడు. నెలకొకసారి మాస శివరాత్రి వచ్చినా చాలా మందికి తెలిసినది ఏడాది కి వచ్చే మహాశివరాత్రి. అలాగే ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి వేరే రాశి లోకి ప్రవేసించేది సంక్రాంతి అని – అయితే సూర్యుడు మకర రాశి లోకి ప్రవేసించే మకర సంక్రాంతి నే మనం ఏడాది కి ఒకసారి సరదాగా జరుపుకునే మూడు రోజుల పండగ అని చెప్పాడు.

నాకు ఈ సంక్రాంతి నచ్చడానికి ముఖ్య కారణం – ఇది ప్రత్యేకంగా ఏ దేవుడి పుట్టినరోజో (వినాయక చవితి, రామ నవమి, కృష్ణాష్టమి వంటివి ) కాకుండా ప్రకృతి కి సంబంధించి వుండడం. పంటలు ఇంటికి చేరే సమయం కావడం తో పల్లెలలో అందరి ఇంటా హడావుడి. రైతన్నకు చేతిలో డబ్బుల గలగల, చేలో గంగమ్మ గలగల, చిన్నారుల నుండి చిట్టెమ్మల దాకా అందరి మోములో చిరునవ్వుల గలగల. ఇది నిజంగా పల్లెల పండుగ, ప్రకృతి పండగ, ప్రజల పండగ.

ఇప్పుడు అమెరికాలో తెలుగు సంఘాల ధర్మమా అని పండుగలను, మళ్ళి మనకు తెలిసిన విధం గా జరుపుకుని సంస్కృతి ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. మకర సంక్రాంతి మరో సరి వస్తోంది. రండి అందరం కలసి జరుపుకుందాం. పండగ చేసుకుందాం.

logo
HOME | MEMBERSHIP | DONATE | EVENTS & TICKETS | BY LAWS | LATA 2024 TELUGU CALENDAR | TAX SUMMARY | CONTACT US | ADMIN PANEL

Los Angeles Telugu Association | Copyright © | All Rights Reserved®